తమ జీవనోపాధిని దెబ్బతీసే కార్పొరేట్ స్థాయి సెలూన్ షాపులకు అనుమతులు మంజూరు చేయవద్దంటూ శుక్రవారం పిఠాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు నిరసన చేశారు. ప్లకార్డులతో ర్యాలీగా స్థానిక మున్సిపల్ కార్యాలయానికి తరలి వెళ్లారు. నాయి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల జీవన భృతిని దెబ్బ కొడుతూ కార్పొరేట్ స్థాయి హంగులు, ఆర్భాటాలతో సెలూన్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దన్నారు.