నాయి బ్రాహ్మణుల కులవృత్తిని దెబ్బతీసే విధంగా, నాయి బ్రాహ్మణులు జీవనాధారం కోల్పోయే విధంగా కార్పొరేట్ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన సెలూన్ షాప్లపై పిఠాపురం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాడా ఛైర్మన్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. నాయి బ్రాహ్మణ కులానికి చెందిన తామంతా కులవృత్తి అయిన మంగలి పనిపై ఆధారపడి జీవిస్తున్నామని కొంతమంది మా పొట్ట కొట్టే విధంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు.