పిఠాపురం: నీటిని పొదుపు చేసి పర్యావరణాన్ని రక్షిద్దాం

64చూసినవారు
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పిఠాపురంలో హై స్కూల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్