జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం కల్పించనుండడంపై నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పిఠాపురం సీతయ్య గారి తోటలోని జనసేన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెల్లుబోయిన సతీష్, చల్లా లక్ష్మి, దానం లాజర్ బాబు, బీఎన్ రాజు, జనపరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.