పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి వంగా గీత ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పిఠాపురం వైసీపీ కార్యాలయం నందు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పిఠాపురం రధాలపేట అంబేద్కర్ సెంటర్ నందు విగ్రహమునకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశానికే దిక్సూచి అయ్యిందని కొనియాడారు.