పిఠాపురం: పోలీసుల చేతికి చిక్కిన ద్విచక్ర వాహనాల దొంగ

75చూసినవారు
ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ లో కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ ఆదివారం వివరాలు వెల్లడించారు. కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో నిందితుడు గంగాధర్ బైకులు దొంగతనం చేశాడని చెప్పారు. ప్రత్యేక టెక్నాలజీ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. అతడి నుంచి 48 బైకులను రికవరీ చేశామని, నిందితుడి దగ్గర బైకులు కొన్నవారిని గుర్తించి విచారణ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్