ప్రత్తిపాడు మండలం చింతపల్లి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు ఆదివారం లయన్స్ క్లబ్ సహకారం అందించింది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆదివారం పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డా. చప్పిడి వెంకటేశ్వరరావు, క్లబ్ ప్రతినిధులు మాటూరి శిరీష, వెంకీ గోవిందరాజు పాల్గొన్నారు. విద్యార్థుల భవితకు పదోతరగతి కీలకమన్నారు.