ఎక్సైజ్ అధికారులు ఏలేశ్వరం మండలం తిరుమాలి శివారు అరటి తోటల్లో సారా బట్టీపై గురువారం దాడి చేశారు. ప్రత్తిపాడు ఎస్ హెచ్ ఓ శివప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది సారా తయారీకి నిల్వఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను పారబోశారు. అక్కడ ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. బాధ్యుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో వంశీ రామ్, మల్లికార్జున్, కిరణ్పాండే, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు