రాజమండ్రిలో అలరించిన మాళవిక సంగీతం

83చూసినవారు
ప్రముఖ వర్ధమాన సినీ గాయని మాళవిక అద్భుతమైన తన పాటలతో శ్రోతలను అలరించారు. ఓ కార్యక్రమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మాళవికచే సినీ సంగీత విభావరి ఆదివారం నిర్వహించారు. పాత, కొత్త చిత్రాలలోని పాటలను పాడి వీనుల విందు చేశారు. అనంతరం సంస్థ నిర్వాహకులు పిరాట్ల శ్రీహరి, తదితరులు మాళవికను ఘనంగా సత్కరించి అభినందనలతో ముంచెత్తారు.

సంబంధిత పోస్ట్