పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని డిఐజి అశోక్ కుమార్ అభినందించారు. శనివారం రాజమండ్రిలోని ఎస్పీ కార్యాలయంలో సిట్ టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400 కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో సిట్ అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.