దేశంలో మహా కుంభమేళా తర్వాత భక్తులు అంతే విశ్వాసంతో అధిక సంఖ్యలో పాల్గొనే గోదావరి పుష్కరాలను విజయవంతంగా చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు సుమారు రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ తగిన ప్రణాళికలు ఇప్పట్నుంచే రూపొందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.