రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు.