రాజమండ్రి: రామాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

70చూసినవారు
రాజమండ్రిలోని 23వ డివిజన్ చందాసత్రం సమీపంలో జరుగుతున్న రామాలయం పున: నిర్మాణ పనులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి భవాని చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 1, 00, 000 సామాగ్రి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సభ్యులకు సూచించారు.

సంబంధిత పోస్ట్