పార్లమెంట్‌లో అంబేడ్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి శనివారం రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షాకు అంబేడ్కర్ వాదులు నిరసన వ్యక్తం చేయాలని ఏపీ ప్రజా సంఘాల జేఎసీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ అభిమానులు అమరావతిలో నిరసన వ్యక్తం చేసేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.