ఏపీ సేవా కింద 1503 దరఖాస్తులలో 1384 పరిష్కారం చెయ్యగా, ఇంకా 119 పరిష్కారం చేయవలసి ఉన్నాయని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు నిర్ణిత సమయంలోగా వాటిని పరిష్కరించాలన్నారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో ఆమె మాట్లాడారు. గ్రామ వార్డు సచివాలయం ద్వారా వివిధ అంశాల ఆధారంగా నిర్వహిస్తున్న సర్వే చేపట్టడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు.