ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా, రాజకీయ ప్రక్షాళన చేసే దిశగా పార్టీలన్నీ ఏకం కావాలని విద్యార్థులు, యువత ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆర్.పి.సి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ ఏపీకి ద్రోహం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తుల నుంచి బయటపడి ఎంతో విలువైన సంపద గల మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలన్నారు.