ఎన్నికల విధుల్లో మినహాయింపులుపై తప్పుడు రికార్డులు సమర్పిస్తే వారిపై చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత హెచ్చరించారు. బుధవారం పలు కారణాలతో ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యత నుంచి మినహాయింపులు కోరుతూ ఉద్యోగులు కలక్టరేట్‌లో దరఖాస్తులను సమర్పించారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిర్వహించే ప్రక్రియని ఒక పవిత్రమైన బాధ్యతగా భావించాలని కలెక్టర్ అన్నారు.