ధవలేశ్వరంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

66చూసినవారు
గోదావరి వరద ఉధృతి క్రమేపి పెరుగుతోంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద బుధవారం ఉదయం 5 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్కడ గోదావరి వరద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను కిందికి విడుదల చేశారు. దీంతో గోదావరి రివర్ కన్జర్వేటర్ కాశీ విశ్వేశ్వర రావు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్