రాజమండ్రిలోని 9వ డివిజన్ కోకా భాస్కరమ్మ నగర్లో రోడ్డు నిర్మాణ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమండ్రి నగర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు తదితర నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.