కడియం మండలం కడియపులంక గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని కరెన్సీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు రూ. 20 లక్షలతో 10 నుంచి ఐదు వందల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. 5 రోజులు 10 మంది శ్రమించి కరెన్సీ నోట్లతో అలంకరణ చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.