భారత స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన ప్రాణత్యాగం నేటితరం యువతకు ఆదర్శం కావాలని ప్రముఖ న్యాయవాది పోరాటి వసంతరావు, భగత్ సింగ్ సేవాసమితి అధ్యక్షులు తమ్మిశెట్టి ప్రసాద్ పేర్కొన్నారు. కడియంలో ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 'భగత్ సింగ్ అమర్ రహే' అంటూ నినాదాలు ఇచ్చారు.