కడియం మండలం కడియపులంకలోని సత్యదేవా నర్సరీని మద్రాస్ హై కోర్ట్ జడ్జి వి. శివజ్ఞానం శనివారం సందర్శించారు. నర్సరీ యజమాని పుల్లా ఆంజనేయులు ఆగ్లోనిమా సిల్వర్ మొక్కతో వారికి స్వాగతం పలికారు. అనంతరం నర్సరీని సందర్శించి వివిధ రకాల పండ్లు, పువ్వులు ఆర్నమెంటల్ మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్జి మాట్లాడుతూ తూర్పు గోదావరిలోని నర్సరీలు ఎంతో ప్రాముఖ్యమని సత్యదేవా నర్సరీ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.