రాజమండ్రి రూరల్ మండలం కోలమూరులో ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన బ్రాంచ్ ను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం ప్రారంభించారు. బ్యాంకు చైర్మన్ కోళ్ళ అచ్యుత రామారావు మాట్లాడుతూ ఇప్పటివరకు బ్యాంకు 4 బ్రాంచీలకు చేరినట్లు తెలిపారు. ఇప్పటికి 107 ఏళ్లు పూర్తిచేసుకుని ఖాతాదారుల విశ్వాసంతో మన్ననలు పొందుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు.