రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి రాజకీయ దురoదరుడు అని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు కె ఎస్ జవహర్ అన్నారు. శనివారం రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్ లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని జవహర్ కలిసి 80వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. గోరంట్ల రాజకీయ దురంధరుడు, తన 44 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉండి ఎన్నో పదవులు అధిరోహించారని అన్నారు.