రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలోని ప్రజలకు ఉపాధి కల్పించాలని బీజేపీ నేతలు జిల్లా కలక్టర్ ప్రశాంతికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసి మోర్చా రాష్ర్ట అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు మాట్లాడుతూ శాటిలైట్ సిటీలో పేద మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉన్నారని అన్నారు. వారికి ఉపాధి కల్పించాలని కృషి చేయాలని కోరారు.