గ్రామస్థాయిలో ప్రజలు భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలంలోని కాతేరు గ్రామంలో రెవిన్యూ అధికారులు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల సమస్యలకు అధికారులు పరిష్కారం చూపాలని ఆయన సూచించారు.