రాజమండ్రి: మర్డర్ కేసులో పలు అనుమానాలు

79చూసినవారు
రాజమండ్రి: మర్డర్ కేసులో పలు అనుమానాలు
హుకుంపేటలో ఆదివారం జరిగిన తల్లి కూతుళ్ల డబుల్ మర్డర్ కేసు తూ. గో జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ హత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. కాగా ఆ యువతి మరొకరితో చాటింగ్ చేయడాన్ని సహించని శివకుమార్ పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్