హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆంధ్ర రాష్ట్రంలోని ముస్లింలకు కూటమి సర్కార్ ఇచ్చిన వెన్నుపోటు రంజాన్ తోఫా అని వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ తీవ్రంగా విమర్శించారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ముస్లింలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.