ఘనంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

78చూసినవారు
ఘనంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
కడియం మండలం కడియపులంకలోని శ్రీ హరి హర మహా క్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలశపూజ నిర్వహించి అమ్మవారిని ప్రతిష్టించారు. కాగా అమ్మవారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్