కోరుకొండ, గోకవరం, గంగవరం మండలాల్లో రైతులు ధాన్యాన్ని రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆదివారం కురుస్తున్న వర్షాలకు పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా బరకాలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. దూరంగా ఉన్న ధాన్యాన్ని ప్రధాన రోడ్లపైకి తీసుకువచ్చి కుప్పలుగా పోసి, వాటిపై జాగ్రత్తగా బరకాలు కప్పుతున్నారు. ఈ తుఫాను కారణంగా చాలా నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.