రాజానగరం, కోరుకొండ, సీతానగరం గోకవరం మండలాలలో అన్నదాతలు ధాన్యపు రాశులను ఆరబెట్టే పనులతో బిజీగా ఉన్నారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడిన రైతన్నలు, ఇప్పుడు ఎండలు కాస్తుండడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. పొలాల్లోనూ, సురక్షిత ప్రాంతాల్లో ఉన్న ధాన్యాన్ని పొడిగా ఉన్న మైదాన ప్రాంతాలకు తీసుకువచ్చి ఆరబెట్టుకుంటున్నామని శనివారం రైతులు తెలిపారు.