రాజానగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు పదిలంగా అందించవలసిన బాధ్యత అందరిపైన ఉందని పలువురు వక్తలు గుర్తు చేశారు. యూనివర్సిటీ ఛాన్స్ లర్ సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించారు.