రామచంద్రపురంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు కారణమైన మను ధర్మశాస్త్రాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దగ్ధం చేశారు. అంబేద్కర్ మను ధర్మశాస్త్రాన్ని దహనం చేసి 97 ఏళ్ళు అయిన సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం పిడిఎస్. యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్దు మాట్లాడుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు మను ధర్మశాస్త్రం కారణమన్నారు.