చింతూరు మండలం మోతుగూడెం మేజర్ పంచాయతీలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గుర్తింపు కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభ జూనియర్ ఇంజనీర్ శ్రీను, సర్పంచ్ సీత, సెక్రటరీ రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ముందస్తు ప్రణాళికను ఉపాధి హామీ కూలీల సమక్షంలో నిర్వహించారు. 2024 -25 సంవత్సరానికి గాను 17 పనులను గుర్తించారు.