చింతూరు: రూ. 5 లక్షలు విలువైన గంజాయి సీజ్

70చూసినవారు
డొంకరాయి శివారు వనదుర్గ ఆలయం సమీపంలో రూ. 5 లక్షల విలువైన రెండు కిలోల లిక్విడ్ గంజాయిని బుధవారం పట్టుకున్నట్లు డొంకరాయి ఎస్సై శివకుమార్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన రాహుల్ చంద్ర కాప్రి అనే వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుండగా అతన్ని పట్టుకుని తనిఖీలు నిర్వహించగా లిక్విడ్ గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామన్నారు. గంజాయి రవాణపై కఠిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్