రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట ఎస్సి కాలనీ తదితర గ్రామాల ప్రజల రవాణా కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. అప్పలరాజుపేట జంక్షన్ నుంచి ఎస్సి కాలనీ వరకు 2 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణ పనులను నేటి నుంచి చేపట్టనున్నట్లు గుత్తేదారు అప్పారావు తెలిపారు. రహదారి కష్టాలు తీరనుండడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.