రాజవొమ్మంగి పరిధిలోని అల్లూరి సెంటర్లో రాజవొమ్మంగి ఎస్ఐ నరసింహామూర్తి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. లైసెన్స్, వాహనం పేపర్లు లేని పలు వాహనదారులకు జరిమానా విధించారు. వాహనాలు నడిపే వారంతా రికార్డులు కలిగి ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, సారా నిషేధిత సరుకుల రవాణకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు.