రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ముందు అంగన్వాడీ, ఆశా, సానిటరీ వర్కర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం డివిజన్లోని అన్ని మండలాల కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.