రాజోలులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

1535చూసినవారు
రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత పది రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతవరణం చల్లబడటంతో ఉపసమనం పొందుతున్నారు. ఈ వర్షంతో అంతర పంటలకు మేలు చేకూరుతుందని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్