ఈ నెల 18న జాబ్ మేళా

83చూసినవారు
ఈ నెల 18న జాబ్ మేళా
రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికాస అధ్వర్యంలో ఈ నెల 18న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. సాయిబాబు గురువారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా తదితర విద్యార్హతలున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఈ జాబ్ మేళాకు విచ్చేసే అభ్యర్థులు అర్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ లు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్