సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో రొయ్యల చెరువుల తొలగింపు అంశంపై శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. రొయ్యల చెరువులను తొలగించేందుకు మత్స్య, రెవెన్యూ, పోలీసు శాఖ ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు. దీంతో రొయ్యల చెరువుల తొలగింపుపై యజమానులు అభ్యంతరం తెలిపారు. చెరువులు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.