కోటనందూరు: మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

70చూసినవారు
నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని కోటనందూరు ఎస్ఐ టి. రామకృష్ణ హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రి పెట్రోలింగ్‌ గస్తీని ముమ్మరం చేసామన్నారు. యువత రోడ్లపై మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని ఆకాక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్