కోటనందూరు మండలంలోని కొత్తకొట్టాం గ్రామంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్లలోని మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగా ఉండడంతో కలుషిత వాతావరణం ఏర్పడి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించి మెరుగైన పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.