తునిలో అమ్మాజీపేటకి చెందిన ఎం. స్వర్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ గీతారామకృష్ణ తెలిపారు. చినదొడ్డిగొల్లు ప్రాంతానికి చెందిన పి. సూరిబాబుతో ఆమె కలిసి ఉండేదన్నారు. ఆమె 2016లో ఖత్తర్ వెళ్లి ప్రతినెలా జీతం డబ్బు 2022 ఫిబ్రవరి వరకూ సుమారు రూ. 78 లక్షలు సూరిబాబుకు పంపారన్నారు. డబ్బులు ఇవ్వాలని అడగ్గా ఇవ్వకుండా మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు.