తాండవ నది నుంచి సొంత అవసరాల కోసం ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత ఇల్లు నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతోనైనా ఉచితంగా తీసుకెళ్లొచ్చని యనమల అన్నారు. ఇసుక రీచ్‌లో ఎలాంటి ప్రోక్లైన్, జేసీబీలు వాడకూడదని తెలిపారు.