పశు సంపదను రక్షించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో గురువారం మినీ గోకులం షెడ్ ను టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఈ మినీ గోకులం షెడ్లను నిర్మించారని తెలిపారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట, ఉపాధి లభిస్తుందని అన్నారు.