ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ సందడి
ప్రముఖ సినిమా హీరో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు శనివారం ఉదయం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుండి ఆయన రోడ్డు మార్గాన పిఠాపురం బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు ఆయన తల్లి, మావయ్య అరవింద్ బయలుదేరి వచ్చారు.