అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.