ఆచంట మండలం కరుగోరుమిల్లిలో బుధవారం ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభలను ఊరేగించి పంట పొలాల మధ్యలో నుంచి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడేరు, కందరవల్లి, వల్లూరు, పెనుమంచిలి గ్రామాల ఆలయాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తులు ప్రభలను దర్శించుకున్నారు. కనుమ రోజున ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీ అని పెద్దలు తెలిపారు.