పల్లెపాలెంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

82చూసినవారు
పల్లెపాలెంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం
అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ గ్రామంలో ఉన్న పల్లెపాలెం స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు కిరువైపులా జంగిల్ క్లియరెన్స్ పనులను శనివారం చేపట్టారు. పంచాయితీ సర్పంచ్ దాసరి విజయ్ కుమార్ కు పల్లెపాలెం వాసులు జంగిల్ క్లియరెన్స్ చేయమని విజ్ఞప్తి చేయగా, ఆయన వెంటనే స్పందించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిత, ఉపసర్పంచ్ మండలి వెంకటేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్